అజ్ఞానంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకుల ధర్నాలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ప్రకృతి వైపరీత్యాలు, ఏలినో ప్రభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందనే కనీస జ్ఞానం లేకుండా బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆమనగల్ మార్కెట్ చైర్పర్సన్ యాట గీతా నరసింహం మండిపడ్డారు. పదేళ్లలో రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు నేడు ప్రజా ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా డ్రామాలాడుతున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె ఘాటుగా హెచ్చరించారు.