ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక దిగ్గజాలకు మంత్రి నారా లోకేశ్ పిలుపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలువురు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా మరియు వెల్స్పన్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌లతో ఆయన భేటీ అయ్యారన్నారు. ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు కాకినాడలో వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును స్థాపించాలని కోరగా, వారి నుండి సానుకూల స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు.