గచ్చిబౌలిలో మరో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ నగరంలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను మరో మూడు నెలల పాటు కొనసాగించనున్నట్లు సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ అలాగే అండర్పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వరకు రహదారిని మూసివేస్తున్నామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను గమనించి తదనుగుణంగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.