కొడుకు, కోడలు మోసం చేశారంటూ మియాపూర్‌లో వృద్ధ దంపతుల ధర్నా

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. కొడుకు, కోడలు తమను ఇంటి నుంచి గెంటివేశారని, తమకు తెలియకుండా ఇంటిని అమ్మకానికి పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. వృద్ధాప్యంలో తమను ఆదుకోవాల్సిన వారే ఇలా చేయడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.