స్వచ్ఛతను సామాజిక బాధ్యతగా మార్చాలి: సీఎం చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
నెలలో ఒకరోజు స్వచ్ఛతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని స్పష్టం చేశారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చుకునే విధానాన్ని అవలంబిస్తున్నామని, ఐదు కోట్ల మంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.