యువతి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు కలవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన

రిపోర్టర్: రమేష్ స్థలం: రాంపూర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలో పదవ తరగతి చదువుతున్న కీజ్రా జుబైర్, తుబా జుబైర్ అనే కవల అక్కచెల్లెళ్ల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు ఒకేలా ఉండటంతో తీవ్ర సమస్య ఎదురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. పదవ తరగతి రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ వివరాలు అప్డేట్ చేస్తుండగా ఒకరి బయోమెట్రిక్ మరొకరితో మ్యాచ్ అయి రెండో దరఖాస్తు డూప్లికేట్గా నిలిచిపోయిందని వారు పేర్కొన్నారు. ఈ విచిత్ర సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించినట్లు బాధితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.