రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: కిరణ్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా పరిధిలోని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. భూముల సర్వే వివాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.