ట్రంప్, వాన్స్లకు అబ్దుల్ ఎల్ సయేద్ సవాల్: ఇకపై నన్ను సెనేటర్ అనండి

రిపోర్టర్: రాము స్థలం: మిషిగన్

అమెరికాలోని మిషిగన్ సెనేట్ ఎన్నికల్ లో అద్భుత విజయం సాధించిన అబ్దుల్ ఎల్ సయేద్ డొనాల్డ్ ట్రంప్ మరియు జెడి వాన్స్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పేరును ఉద్దేశించి ప్రత్యర్థులు చేసిన అవహేళనలను తీవ్రంగా ఖండించినట్లు ఆయన విజయోత్సవ ప్రసంగంలో స్పష్టం చేశారు. వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనను కేవలం సెనేటర్ అని మాత్రమే పిలవాలని ట్రంప్ కు ఘాటుగా బదులిచ్చారు.