దివంగత ఏఎంసీ డైరెక్టర్ గాలి రామకృష్ణారెడ్డి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించిన పలువురు నాయకులు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మనుబోలులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాలి రామకృష్ణారెడ్డి వేకువజామున కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొకేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.