డెంకాడ జడ్పీటీసీ స్థానంలో త్రిముఖ పోటీ: హోరాహోరీగా ఎన్నికల పోరు

రిపోర్టర్: గోపి స్థలం: డెంకాడ

స్థానిక సంస్థల ఎన్నికల్ లో భాగంగా విజయనగరం జిల్లా డెంకాడ మండలం జడ్పీటీసీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొందని స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థి తుమ్మి లక్ష్మి, వైకాపా అభ్యర్థి పిన్నింటి తమ్మునాయుడుతో పాటు తిరుగుబాటు అభ్యర్థిగా కనకల రామారావు బరిలో నిలిచారు. పొత్తు ధర్మంలో భాగంగా తెదేపా అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం, జనసేనలో టికెట్ కేటాయింపు వివాదం తలెత్తడంతో ఈ స్థానంలో రాజకీయం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.