విజయనగరంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
రిపోర్టర్: తాడి
స్థలం: విజయనగరం
విజయనగరం గురజాడ గ్రంథాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా పీస్ 2026 సంస్థ ఆధ్వర్యంలో 150 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సంస్థ అధ్యక్షురాలు గోగాడ సుధారాణి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని కొనియాడారు.
ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బేశెట్టి బాబ్జి, ఏజ్జు మురళీకృష్ణ, పి. రుక్మిణి, మాదవి, సింహచలం, గోవింద తదితరులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు.