భారీ వర్షాలతో అతలాకుతలమైన విశాఖ నగరంలో ముసర్లు ముప్పు

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయని, వరద నీరు కాలనీలను ముంచెత్తిందని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం రక్షణ గోడల నిర్మాణానికి నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రధాన పైపులైన్లు మురుగు కాల్వల్లో కలవడం వల్ల తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.