కేటీఆర్ పీఏ విచారణ సీసీటీవీ టేజీ భద్రపరచాలని హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ కుంభా మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మాణిక్యల విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పకడ్బందీగా భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. గత సెప్టెంబర్ 14న పోలీస్ స్టేషన్‌లో తమపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించారంటూ వారు కోర్టును ఆశ్రయించగా, జస్టిస్ టి. మాధవి దేవి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ హోం శాఖకు నోటీసులు పంపారు.