పురుషోత్తపురంలో సరస్వతీ దేవిగా భక్తులకు కనువిందు చేసిన జగన్మాత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరవ రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంకుపల్లి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.