ఢిల్లీలో ప్రముఖుల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఎన్నికల సంఘం నోటీసులు

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీలతో పాటు పలువురు ప్రముఖుల కుటుంబాలకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. గత సర్ రికార్డులతో ప్రస్తుత ఓటరు వివరాలు మ్యాచ్ కాకపోవడంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.