గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ దంపతులకు అపూర్వ సన్మానం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామపంచాయతీలో ప్రజలతో మమేకమై ఉత్తమ సేవలు అందించినందుకు బాదంపల్లి సర్పంచ్ సామల్ల భాగ్యలక్ష్మి–లక్ష్మీరాజం దంపతులు, ఉపసర్పంచ్ ఎం. లక్ష్మీనారాయణను శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ప్రముఖ కాంట్రాక్టర్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాదాడి పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్లకు శాలువాలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడంలో వారు చేస్తున్న కృషిని పూర్ణచందర్రావు ప్రశంసించారు.