కెన్యాలో టాటా కెమికల్స్ కార్యకలాపాలపై అధ్యక్షుడు విలియం రుటో ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: World

కెన్యాలో టాటా కెమికల్స్ వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అధ్యక్షుడు విలియం రుటో మండిపడ్డారు. వందేళ్ల కాంట్రాక్టు ఉన్నా అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నిర్మించలేదని, ఇకపై కార్యకలాపాలు నిలిపివేసి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. మనం ఇతరులకు బానిసలమా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై టాటా సంస్థ స్పందిస్తూ, చట్టపరమైన మార్గాల ద్వారా చర్చలకు సిద్ధమని ప్రకటించింది.