ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై అధికారుల స్పష్టత
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో సూపర్సిక్స్ పథకాల అమలుపై కలెక్టర్ల సదస్సులో అధికారులు వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల ఆక్యుపెన్సీ రేషియో 62 శాతానికి పెరిగిందని రవాణాశాఖ కార్యదర్శి కోనశశిధర్ తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణాలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,267 కోట్ల భారం భరించిందని పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం-2 పథకాల ద్వారా వేలాది కోట్ల లబ్ధి చేకూర్చినట్లు అధికారులు వివరించారు.