పస్తాపూర్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డికి ఘన నివాళి
రిపోర్టర్: md khaleel
స్థలం: సంగారెడ్డి
జహీరాబాద్ మండలం పస్తాపూర్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్, న్యాల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కె. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని, ప్రతాప్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.