జాతీయ రహదారులపై సోలార్ కాంతులు: ప్రమాదాల నివారణకు రూ.13 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: Rajamahendravaram
జాతీయ రహదారులపై రాత్రివేళల్లో పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి రూ.13 కోట్ల వ్యయంతో 104 ప్రాంతాల్లో సుమారు 533 సోలార్ లైట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో వెలుతురు కొరతను నివారించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.