నవీముంబైలో పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో భారీ దొంగతనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: నవీముంబై

నవీముంబైలోని సీబీడీ బేలాపూర్ పరిధిలోని అగ్రోలి గ్రామంలో సోమవారం పగటి పూట గుర్తుతెలియని దొంగలు సంచలనం సృష్టించారు. ఏపీఎంసీ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ షిర్కే దంపతులు విధులకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అల్మారాలో భద్రపరిచిన మూడున్నర లక్షల రూపాయల విలువైన ముప్పై ఐదు గ్రాముల బంగారం, ఇరవై ఐదు వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.