హైదరాబాద్ లో వీధి దీపాల నిర్వహణకు భారీ ప్రణాళిక: రూ.1,720 కోట్లతో ఆమోదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి దీపాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు ఆమోదం తెలిపిందని మున్సిపల్ పరిపాలన శాఖ వెల్లడించింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సుమారు ఏడు లక్షల ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పదేళ్లపాటు ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఈ మేరకు గతంలో ఉన్న అనుమతులను సవరించి మొత్తం వ్యయాన్ని రూ.1720.83 కోట్లకు పెంచినట్లు అధికారులు మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్ లో పేర్కొన్నారు.