రూపాయి వివక్ష లేకుండా బుచ్చిరెడ్డిపాలెంలో కోట్లతో అభివృద్ధి పనులు

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

రాజకీయాలకు అతీతంగా ప్రజల క్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. వైకాపా కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో కూడా ఎలాంటి వివక్ష చూపకుండా సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించినట్లు తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ చొరవతో మంజూరైన నిధులతో పట్టణంలో పనులు వేగవంతం చేశామని వెల్లడించారు.