'వినాయకమండపం విషయంలో దారుణం': అనంతపురంలో ట్రాన్స్‌జెండర్ హత్య
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తమైంది. వినాయకమండపం ఆహ్వానం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో వీరేష్, అతని సోదరుడు చరణ్ అలియాస్ జగన్‌లపై మరో ట్రాన్స్‌జెండర్ వర్గం కర్రలు, కత్తులతో తీవ్రంగా దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటనలో తీవ్రగాయాలైన చరణ్ ప్రాణాలు కోల్పోగా, వీరేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.