'రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి': హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

రేవంత్ రెడ్డి కుటుంబానికి మూడొందల ఎనిమిది ఎకరాల భూమి ఉందని తన్నీరు హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ తమ్ముళ్లు, బిడ్డకు ఉన్న భూముల చుట్టే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వచ్చాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న భూముల దందాలపై తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని తన్నీరు హరీష్ రావు స్పష్టం చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.