హైదరాబాద్లో మహావీర్ మోటార్స్ రికార్డు: ఏకకాలంలో యాభై లగ్జరీ కార్ల డెలివరీ

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

హైదరాబాద్లోని కొండాపూర్ మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ వేదికగా దసరా పండుగ సందర్భంగా మహావీర్ మోటార్స్ సంస్థ ఏకకాలంలో యాభై లగ్జరీ కార్లను కస్టమర్లకు అందజేసి సరికొత్త రికార్డు సృష్టించిందని యాజమాన్యం వెల్లడించింది. పండుగ రోజున కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాలనే కస్టమర్ల కల ఈ వేడుక ద్వారా సాకారమైందని, లగ్జరీ ఆటోమొబైల్ రంగంలో ఈ సంఘటన నూతన మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుదారుల కుటుంబాలలో పండుగ ఉత్సాహం రెట్టింపు అయిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.