ఖైజాగూడలో రూ.680 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా: సాస్ ఇన్ఫ్రా అరాచకం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని ఖైజాగూడలో రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సాస్ ఇన్ఫ్రా కంపెనీ కబ్జా చేసిందని గ్రీన్గ్రేస్ అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి 3.17 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని స్థానికులు తెలిపారు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఒత్తిడి తెస్తుండటంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారని సమాచారం.