దేవుడి విగ్రహాలను జేసీబీలతో పగలగొట్టడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Huzurabad
హుజూరాబాద్ నియోజకవర్గంలో నీళ్లు లేక వినాయక విగ్రహాలను జేసీబీలతో పగలగొట్టడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు మునిగేలా నీళ్లు వదలలేకపోయారని, పూజించే దేవుడి విగ్రహాలను యంత్రాలతో పగలగొడుతుంటే రక్తం మరిగిందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.