ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో ఆలియా భట్ కీలక పాత్ర?
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'డ్రాగన్' చిత్రంలో ఆలియా కీలక పాత్ర పోషించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. దీంతో ఆలియా టాలీవుడ్ ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.