నరసారెడ్డి కాలనీలో వైభవంగా అమ్మవారి ప్రాణప్రతిష్ఠ: భక్తుల పూజలు
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: పొదలకూరు
పొదలకూరు పట్టణంలోని నరసారెడ్డి కాలనీలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు ఉక్కాల చెన్నకృష్ణ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.