స్థానిక పోరులో కాషాయ జెండా ఎగరేస్తామన్న మడక పార్వతి రమేష్
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతీ రమేష్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని మాధవ్ దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 106వ వార్డులో పార్టీ విజయం కోసం కృషి చేస్తానని పార్వతీ రమేష్ తెలిపారు.