రాజీవ్ రహదారిపై దుండగుల వీరంగం: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ

రిపోర్టర్: గోపి స్థలం: తిమ్మాపూర్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. రామకృష్ణ కాలనీకి చెందిన చెంచు లక్ష్మి తన భర్తతో కలిసి బైక్ పై వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న అర్ధ తులం పుస్తెలతాడును లాక్కెళ్లారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ నేరం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.