మద్యం రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌పై ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు కారుమూరి నాగేశ్వరరావుకు ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆయణ్ని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.