పెద్దపల్లిలో పెండింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: కిరణ్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్డు నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. రెండు వారాల్లో రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్లైన్లను పూర్తిగా తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెండింగ్ రోడ్డు నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ పెద్దపల్లి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.