ఆదోని ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్: ఐపీఎల్ తరహాలో వేడుకల నిర్వహణ

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ తరహాలో 400 మీటర్ల ట్రాక్ చుట్టూ క్రాకర్లు వెలిగించి, ఆకాశాన్ని రంగుల ప్రపంచంగా మార్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ వినూత్న ఏర్పాట్ల వెనుక యువ నాయకులు మారుతి నాయుడు కృషి ఉందని పలువురు ప్రశంసిస్తూ క్రీడాకారులకు ఉత్సాహాన్ని అందించాలని కోరారు.