రాయగిరి వద్ద భవ్య యాదాద్రి స్వాగత తోరణ నిర్మాణానికి ఘనంగా పూజలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
భువనగిరి మండలం రాయగిరి కమాన్ వద్ద నూతనంగా చేపట్టనున్న యాదాద్రి స్వాగత తోరణం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఎంఎస్ఎన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొని పనులు సజావుగా సాగాలని ఆకాంక్షించారు.