కంచరపాలెం యానాదుల దుర్భర బతుకులకు అండగా నిలవాలంటూ దాతలకు సుజిత్ పిలుపు
రిపోర్టర్: sujith reddy
స్థలం: విడవలూరు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ కంచరపాలెం ఇసుక దిబ్బలపై చల్ల యానాదులు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారి వద్ద కనీసం ధరించడానికి సరిపడా వస్త్రాలు కూడా లేవు. దసరా పండుగ సందర్భంగా వారికి బట్టలు అందించాలని సంకల్పించాము. ఇక్కడ సుమారు ఐదుగురు చిన్న పిల్లలు ముప్పై మంది మహిళలు ముప్పై మంది మగవారు ఉన్నారు. దాతలు ముందుకు వచ్చి వారికి చేయూతనందించాలని కోరుతున్నారు.