భారత్ పై వంద శాతం సుంకాలు విధించే బిల్లుపై ట్రంప్ నిర్ణయం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో రష్యా ఆంక్షల బిల్లు ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.