ఢిల్లీ విమానాశ్రయంపై తప్పుడు ప్రచారం: 63 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ విమానాశ్రయంలో వరద ముంపు అంటూ నకిలీ వీడియోలు ప్రచారం చేసిన 63 సోషల్ మీడియా ఖాతాలపై డీఐఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పాత వీడియోను ఢిల్లీగా చూపించి తప్పుదారి పట్టించారని ఆరోపించింది. ప్రజాభద్రతకు భంగం కలిగించేలా, సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.