రైతన్నలకు తీపి కబురు: రాష్ట్రంలో పందొమ్మిది మునగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
మునగ సాగు చేసే రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రైతులను ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో భాగస్వాములుగా చేయడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఈ యూనిట్లను నెలకొల్పుతున్నామని, దీనివల్ల రైతులకు మెరుగైన మద్దతు ధర లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.