భారత్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు
రిపోర్టర్: హరి
స్థలం: India
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. గడిచిన ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 2.98 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో ఏకంగా 52.9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈవీల వాటా 12.3 శాతానికి పెరిగింది.