క్రీడా ప్రాంగణంలో ప్రతిభ చాటుతున్న పల్లెటూరి పసిప్రాయాలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండల కేంద్రంలోని తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి 70వ ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ ఎలికట్టే గురువారావు, ప్రధానోపాధ్యాయురాలు భార్గవి ఈ పోటీలను ప్రారంభించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్ 14, 17 విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి ఎ లింగయ్య పాల్గొన్నారు