మహిళల క్రికెట్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనున్న భారత్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

మహిళల క్రికెట్ లో మరో స్వర్ణ పతకం సాధించే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే ఈ తుది పోరులో శ్రీలంక మహిళల జట్టుతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్లోనూ లంకను ఓడించిన టీమిండియా, ఈసారీ అదే జోరును కొనసాగించి ఆధిపత్యం చాటాలని చూస్తోంది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత బౌలర్లు ఆమెను కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు.