అపరిచితుడికి కిడ్నీదానం చేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జెస్సీ ఐసెన్‌బర్గ్
రిపోర్టర్: శివ
స్థలం: New York
పరిచయం లేని అపరిచితుడికి తన కిడ్నీని దానం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు జెస్సీ ఐసెన్‌బర్గ్ వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి బంధుత్వం లేకున్నా దానధర్మాలు చేయడం ద్వారా పరుల ప్రాణాలు కాపాడవచ్చని, ఈ ప్రక్రియ ఎంతో సులభమని ఆయన తెలిపారు.