హైటెక్ సిటీ ట్రాఫిక్ ఇబ్బట్లకు చెక్: ప్రత్యేక మాస్టర్ ప్లాన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ఐటీ కారిడార్లో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ తెలిపారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, నాలెడ్జ్ సిటీ జంక్షన్లలో వన్ వే లూప్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించి, అన్ని వర్గాల నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఈ వ్యవస్థను దశలవారీగా అమల్లోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.