బుచ్చిరెడ్డిపాలెం ఆసుపత్రికి రూ. 39 లక్షల అత్యాధునిక వైద్య పరికరాల అందజేత
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఐఆర్ఈడీఏ మరియు సీఎస్ఆర్ నిధులతో సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు అలాగే ఫర్నీచర్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ యంత్రం, థైరాయిడ్ టెస్టింగ్ పరికరంతో పాటు ఓటీ లైట్లు, బెడ్లు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యులను ఆమె కోరారు.