ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటూ కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ విజ్ఞప్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ప్రజల నమ్మకమే ఎన్నికల సంఘానికి అత్యంత కీలకమని కేంద్రమంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈసీ అంతర్గత విభేదాల వార్తలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టతనిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తలెత్తిన వివాదాలు, కమిషనర్ల మధ్య అభ్యంతరాలపై ప్రజల్లో నెలకొన్న వోకల్ చర్చలను తొలగించేందుకు ఈసీ తన వైఖరిని గట్టిగా తెలపాలని ఆయన హితవు పలికారు.