రూ. 4.82 కోట్లతో జూలపల్లి రోడ్డు రూపురేఖలు మార్చనున్న ప్రభుత్వం
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రం నుంచి కమ్మర్ ఖాన్పేట వరకు రూ.4.82 కోట్ల నిధులతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేణుక ఎల్లమ్మ ఆలయం ప్రహరీగోడ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మండల అభివృద్ధికి ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.