కూటమి సర్కార్ చొరవతో పట్టణాల్లో మళ్లీ వెలుగులు: ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు పునరుద్ధరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అంధకారంలోకి వెళ్లిన పట్టణాల వీధుల్లో మళ్లీ వెలుగులు ప్రసరింపజేసేలా కూటమి ప్రభుత్వం ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టును విజయవంతంగా పునరుద్ధరించిందని అధికారులు తెలిపారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈఈఎస్ఎల్ సంస్థకు రూ.వందల కోట్ల బిల్లులు నిలిపివేయడంతో నిర్వహణ గాడితప్పినట్లు పేర్కొన్నారు. తాజాగా కూటమి సర్కార్ రాకతో రూ.700 కోట్ల బకాయిలు పరిష్కరించి, నగరాలు మరియు పట్టణాల్లో కొత్తగా పది లక్షలకు పైగా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.