పాతటెక్కలిలో భారీ చోరీ.. దైవ దర్శనానికి వెళ్లిన సమయంలోనే..

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వజ్రపుకొత్తూరు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలిలో భారీ చోరీ జరిగింది. మల్ల భూపతిరావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లిన సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.

బీరువాలో దాచిన 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ. 4.37 లక్షల నగదును దొంగలు అపహరించారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండగ సీజన్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.